Petrol Price: పెట్రోల్ ధరలపై త్వరలో గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన..!

Petrol- Diesel prices: మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా చమురు ధరలు పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దిశగా పెరుగులు పెడుతోంది. చాలా నగరాల్లో ఇప్పటికే రూ.90 మార్కు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.