సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS), సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (CSSS) & సెంట్రల్ సెక్రటేరియట్ క్లరికల్ సర్వీస్ (CSCS) నుండి 8,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ ఆదేశించింది. ఈ మూడు సేవలు కేంద్ర సెక్రటేరియట్ పరిపాలనా పనితీరుకు వెన్నెముకగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలుతెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి తన ప్రమోషన్ పొందకుండానే సర్వీసు నుండి పదవీ విరమణ పొందడం చాలా నిరుత్సాహంగా ఉందని.. ఈ రకమైన దయగల నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అని ఆయన వ్యాఖ్యానించారు.(ప్రతీకాత్మక చిత్రం)
మొత్తం 8,089 పదోన్నతి పొందిన ఉద్యోగులలో4,734 మంది సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS) నుండి వచ్చారు. 327 పదోన్నతులు డైరెక్టర్ల పోస్టులో ఉన్నాయి. డిప్యూటీ సెక్రటరీ పోస్టులో 1,097 పదోన్నతి లభించనుంది. సెక్షన్ ఆఫీసర్ల పోస్టులో 1,472 పదోన్నతులు రానున్నాయి. సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ నుండి 2,966 మందికి పదోన్నతులు రానున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)