కాకినాడ రైలు, సికింద్రాబాద్ రైలు, సికింద్రాబాద్ రైలు, హాలిడే స్పెషల్ ట్రైన్స్" width="1200" height="800" /> బొగ్గు త్వరగా థర్మల్ పవర్ ప్లాంట్లకు చేరుకోవడానికి, విద్యుత్ సంక్షోభం తీరడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 657 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. దేశంలో అత్యధికంగా విద్యుత్ డిమాండ్, బొగ్గు కొరత కారణంగా తలెత్తిన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
తక్కువ సమయంలో థర్మల్ పవర్ స్టేషన్లకు చేరుకుంటాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో విద్యుత్ పరిస్థితి నిలకడగా ఉందని దేశ బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మన దగ్గర దాదాపు 3 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, థర్మల్ పవర్ ప్లాంట్లో 21 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)