2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత భారత ప్రభుత్వం ఉచిత రేషన్ పథకం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని సెప్టెంబర్ 2022 వరకు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఉత్తరప్రదేశ్ కూడా ఇదే విధమైన రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. ఉచిత రేషన్ పథకం కింద ప్రయోజనం పొందడానికి రేషన్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రాలలో ఒకటి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అయితే ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రస్తుత రేషన్ కార్డు నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. రేషన్ కార్డు అర్హత మార్పులపై చర్చించేందుకు ఆహార, ప్రజాపంపిణీ శాఖ త్వరలో వివిధ రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
రేషన్ కార్డు అర్హతల కోసం కొత్త ప్రమాణాలు రూపొందించనున్నారు. ఇది పథకం కింద ప్రస్తుత లబ్ధిదారులపై ప్రభావం చూపుతుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం 80 కోట్ల మందికి పైగా ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనం పొందుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అయితే ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్న వారిలో ఆర్థికంగా స్థిరంగా ఉన్న కొందరు వ్యక్తులు ఉన్నారని.. అయినప్పటికీ వారు ఉచిత రేషన్ పథకాన్ని ఉపయోగిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
దీన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో మార్పులు చేశారు. ఉపాధి నిమిత్తం వలస వెళ్లాల్సిన ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు’ను ముందుగా ప్రారంభించింది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
గతంలో కాకుండా ఇప్పుడు చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డును కలిగి ఉన్న వాళ్లు ఎవరైనా .. దేశంలోని ఏ రాష్ట్రం నుండి అయినా ఉచితంగా రేషన్ పొందవచ్చు. ఇంతకు ముందు రేషన్ కార్డుదారుని సొంత రాష్ట్రం నుండి మాత్రమే పొందగలిగే పరిస్థితి ఉండేది.(ప్రతీకాత్మక చిత్రం)