CENTRAL GOVERNMENT HAS RELEASED NEW GUIDELINES ON CORONA IN INDIA VB
New guidelines: విజృంభిస్తోన్న కరోనా.. వైద్యసేవలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
New guidelines: కరోనా కేసులు దేశంలో పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ ఒక్కరిని ఈ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్తే అతని కండీషన్ ను బట్టి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అయితే వీటిపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
కరోనా పాజిటివ్ అనే ధ్రువపత్రం లేకున్నా ఆసుపత్రిలో చేర్చుకోవాలని.. కరోనా లక్షణాలు కనిపిస్తే తీవ్రతను బట్టి చికిత్స అందించాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
రోగికి వైద్యం అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
వేరే ప్రాంతానికి చెందని వారైనా సరే ఎలాంటి ఐడీ కార్డు అడగకుండా వైద్యం అందించాలంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
కరోనా లక్షణాలు లేని వారికి బెడ్లు కేటాయించి అవసరం ఉన్న వారికి నిరాకరించొద్దని కూడా తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులు ఆసుపత్రులకు మూడు రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఈ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని కోరింది. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలకు అనుగునంగా సేవలు అందించాలంది. (ప్రతీకాత్మక చిత్రం)