Aadhaar-PAN linking: ఆధార్-పాన్ కార్డు లింకింగ్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
Aadhaar-PAN linking: ఆధార్-పాన్ కార్డు లింకింగ్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
Aadhaar-PAN linking: ఆధార్, పాన్ కార్డును ఇంకా అనుసంధానం చేయని వారికి శుభవార్త. ఆధార్, పాన్ లింకింగ్ గడువును మరోసారి పొడిగించింది కేంద్రం. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆధార్, పాన్ కార్డును ఇంకా అనుసంధానం చేయని వారికి శుభవార్త. ఆధార్, పాన్ లింకింగ్ గడువును మరోసారి పొడిగించింది కేంద్రం.
2/ 7
2021, జూన్ 30 లోపు ఆధార్ నంబర్‌తో పాన్ లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ బుధవారం ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
3/ 7
వాస్తవానికి ఇప్పటికే అనేక సార్లు ఆధార్ –పాన్ లింక్ గడువును కేంద్రం పొడిగించింది. గత ఏడాది నుంచి అవకాశాలు ఇస్తూనే ఉంది. కానీ చాలా మంది ఇప్పటికీ ఆధార్, పాన్ అనుసంధానం చేసుకోలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఐతే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆధార్, పాన్ కార్డు లింకింగ్‌కు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ క్రమంలోనే మరోసారి గడువును పెంచాలని చాలా మంది కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ క్రమంలోనే మరోసారి గడువు పొడిగించారు. మార్చి 31 వరకు మాత్రమే ఉన్న ఆధార్ పాన్ అనుసంధానం గడువును.. జూన్ 30, 2021 వరకు పెంచుతున్నట్లు ఐటీశాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు పొడిగింపుపై కేంద్రం ప్రకటన
7/ 7
గడువు తర్వాత పాన్, ఆధార్ నెంబర్స్ లింక్ చేస్తే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని.. ఫైనాన్స్ బిల్ 2021 లో కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)