Covid: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం కొనసా...గుతూ ఉంది. ఐతే... ఆగస్టులో థర్డ్ వేవ్ వస్తుందనే అంచనాలను ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ (NIDM) పక్కకు పెట్టింది. కొత్త అంచనాలను తెరపైకి తెచ్చింది. ఈ కమిటీని కేంద్ర ఆరోగ్య శాఖ (MHA) ఏర్పాటు చేసింది. దీని ప్రధాన పని ఏంటంటే... ఇండియాలో థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో చెప్పడం, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడం. (image credit - twitter)
ఈ NIDM కమిటీ... ప్రకారం... థర్డ్ వేవ్ అనేది ఇండియాలో అక్టోబర్‌లో వస్తుంది. ఈ కమిటీ రకరకాల రిపోర్టులను పరిశీలించి... అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉంది అని తెలిపింది. కాబట్టి... ఇప్పుడు దేశ ప్రజలు ఆగస్టులో అంతగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. అక్టోబర్ నాటికి థర్డ్‌వేవ్‌ని ఎదుర్కొనే ఆస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. (image credit - twitter)
థర్డ్ వేవ్ అనేది గాలి తీసేసిన బెలూన్ లాంటిదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలంటున్నారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలకు ప్రమాదకరంగా కనిపించట్లేదు అంటున్నారు. ఐతే... ప్రస్తుతం పిల్లలకు వ్యాక్సిన్ లేదు. కాబట్టి... వారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. సోకితే, దాన్ని వదిలించడం అంత ఈజీ కాదు. పిల్లలకు అది పెద్ద సమస్యే అవుతుంది. కాబట్టి... పిల్లల్ని కాపాడుకునే విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని NIDM కోరుతోంది. (image credit - twitter)
ఇక ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీలు... అందరి టార్గెట్ పిల్లలే కావాలనీ... వారికి త్వరగా వ్యాక్సిన్ వేయడమే ప్రాధాన్య అంశంగా పెట్టుకోవాలి అని NIDM కోరింది. కాబట్టి మనం అందరం... అక్టోబర్ నాటికి డబుల్ డోస్ వ్యాక్సిన్లు వేయించుకొని... కరోనాకి దొరకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొని... థర్డ్ వేవ్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. (image credit - twitter)
తెలంగాణలో సెప్టెంబర్ నుంచి పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయబోతున్నారు. 12 ఏళ్లు దాటిన పిల్లలకు వేస్తారు. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వాళ్లకే వేస్తున్నారు. పిల్లలకు వేసేందుకు జాతీయ ఔషధ నియంత్రణ మండలి (DCGI) పర్మిషన్ ఇచ్చింది. ఇండియాకి చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ... పిల్లలకు టీకా ఇవ్వనుంది. ఈ వ్యాక్సిన్ 66 శాతం సామర్థ్యం కలిగివుంది. దేశం మొత్తం 12 కోట్ల డోసులు రిలీజ్ చేసేందుకు జైడస్ కంపెనీ రెడీ అవుతోంది. తద్వారా దేశవ్యాప్తంగా పిల్లలకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మొదలవ్వనుంది. (image credit - twitter - reuters)