యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ విషయానికి వస్తే.. సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా రూ. 500 కలిగి ఉండాలి. ఇది గ్రామీణ ప్రాంతాలకు వర్తిస్తుంది. అదే పాక్షిక పట్టణ ప్రాంతాల్లో అయితే మినిమమ్ బ్యాలెన్స్ రూ. 1000 ఉండాలి. ఇక పట్టణాలు, మెట్రో ప్రాంతాల్లో అయితే యావరేజ్ మినిమమ్ బ్యాలెన్స్ రూ. 2 వేలుగా ఉంది. లేదంటే రూ. 45 వరకు చార్జీలు పడతాయి.
ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ (ఐఎంపీఎస్) విషయానికి వస్తే.. రూ.1000లోపు అమౌంట్‌కు చార్జీలు ఉండవు. రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు అయితే రూ. 3, రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు రూ. 5, రూ. 25 వేల నుంచి రూ.లక్ష వరకు రూ. 8, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రూ. 15, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రూ. 20 చార్జీలు చెల్లించాలి. జీఎస్టీ అదనం.