Home » photogallery » national »

BUILDING COLLAPSES IN MUMBAIS DONGRI RESCUE OPS UNDERWAY SR

ముంబైలో కూలిన భవనం.. 12కు చేరిన మృతులు.. ముమ్మరంగా సహాయక చర్యలు

ముంబైలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. డోంగ్రీ ప్రాంతంలోని టాండెల వీధిలోని కేశరబాయి భవంతి... ఉదయం 11 గంటల సయమంలో పేకమేడలో కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద మరో 30 మంది వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఘటనాస్థలానికి చేరుకొని... రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంది.