Budget 2023 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) వరుసగా మూడో సంవత్సరం ఫిబ్రవరి 1న పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. కరోనా వచ్చాక.. కేంద్రం పేపర్ వాడకాన్ని బాగా తగ్గించింది. పైగా ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం 2021 నుంచి బడ్జెట్ను డిజిటల్ రూపంలో తెస్తోంది.
మొబైల్ యాప్ (Union Budget Mobile App) పేరుతో ఉన్న అప్లికేషన్లో బడ్జెట్ను విడుదల చేస్తోంది కేంద్రం. ఈ యాప్లో బడ్జెట్ హైలైట్స్, వార్షిక ఆర్థిక నివేదికలు, బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్ ఒక్క ముక్కలో.. వంటి చాలా విభాగాలు ఉన్నాయి. (image credit - google play store)" width="1280" height="720" /> మొత్తం బడ్జెట్ డాక్యుమెంట్లను ప్రజలు చదివేందుకు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ (Union Budget Mobile App) పేరుతో ఉన్న మొబైల్ అప్లికేషన్లో బడ్జెట్ను విడుదల చేస్తోంది కేంద్రం. ఈ యాప్లో బడ్జెట్ హైలైట్స్, వార్షిక ఆర్థిక నివేదికలు, బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్ ఒక్క ముక్కలో.. వంటి చాలా విభాగాలు ఉన్నాయి. (image credit - google play store)