Bird Flu: కిలో చికెన్ రూ.15 మాత్రమే.. బర్డ్ ఫ్లూ దెబ్బకు రేట్లు ఢమాల్

Bird Flu: దేశంలో బర్డ్ ఫ్లూ కల్లోలం కొనసాగుతోంది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్‌లో పెద్ద మొత్తంలో పక్షులు చనిపోతున్నాయి. కొన్ని చోట్ల చికెన్, గుడ్ల అమ్మకాలపై అధికారులు నిషేధం విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.