ఈ మధ్యకాలంలో చాలా మంది రైతులు తమకు ఇష్టమైన వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ సాగుతో ఒక్కోసారి పంటలు సరిగ్గా పండక పోవడం, మెరుగైన పంట దిగుబడి వచ్చినా.. పండించిన పంటకు మార్కెట్ లో ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అయితే చిన్న రైతులతో పాటు నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తూ.. అండగా నిలుస్తోంది పందుల పెంపకం.
ఇక పందుల పెంపకంలో సమస్యలను సకాలంలో పరిష్కరించవచ్చు. కోసి బేసిన్ డెవలప్ మెంట్ పథకం కింద జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతులు ఆర్థికంగా బలపడేందుకు ఆత్మ ప్రాజెక్టు ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు అధికారులు. ఇప్పుడు జిల్లాలోని 60 మంది రైతులను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ తర్వాత వారికి ఒక మగ, రెండు ఆడ పందులను అందజేస్తారు.