Bihar Assembly Elections 2020: బీహార్లో ఓవైపు కరోనా వైరస్ యాక్టివ్ కేసులు తగ్గుతుంటే... మరోవైపు ప్రజలు జోరుగా ఓటు వేసేందుకు వస్తున్నారు. తొలి దశ పోలింగ్ జరిగినప్పుడు బీహార్లో 9355 యాక్టివ్ కేసులున్నాయి. మూడో చివరి దశ జరుగుతున్న ఇవాళ 6356 యాక్టివ్ కేసులే ఉన్నాయి. ఇది ప్రజలు ఉత్సాహంగా ఓటు వేసేందుకు వచ్చేలా చేస్తోంది. (credit - twitter - ANI)
తొలి రెండు దశల్లో పోటీ NDA, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ మధ్య కనిపించగా... మూడో దశలో చిరాగ్ పాశ్వాన్ పార్టీ LJP కూడా పోటీ ఇస్తోంది. NDA, మహాఘట్బంధన్, LJPలతోపాటూ... ఉపేంద్ర కుష్వాహా RLSP, అసదుద్దీన్ మజ్లిస్ పార్టీ (MIM), మాయావతి BSP, రాజీవ్ రంజన్ జన్ అధికార్ పార్టీలు బరిలో ఉన్నాయి. మూడో దశ పోలింగ్లో మెజార్టీ ఓటర్లు యాదవ కులానికి చెందిన వారున్నారు. (credit - twitter - ANI)
ఈసారి ఎన్డీఏ (BJP-JDU కూటమి - అధికారంలో ఉన్న కూటమి) తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు ప్రచారం చేశారు. నితీష్ కుమార్కు మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను ప్రధాని కోరారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని నితీశ్ కుమార్ మూడో దశ ప్రచారంలో ప్రకటించారు. అందువల్ల మూడో దశలో NDAకి కలిసొస్తుందా అనే విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తేజశ్వి ప్రసాద్ యాదవ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. మరి ఓటర్లు ఏం చేస్తారో ఈవీఎంలకే తెలియాలి. (credit - twitter - ANI)