ఉత్తరాఖండ్ లోని జ్యోషిమఠ్ కుంగిపోతోంది కాబట్టి.. అక్కడ భూకంపం వచ్చే ఛాన్స్ ఉంటుందని ఆయన అంచనా వేశారు." width="1919" height="1438" /> హిమాలయ పరిసర ప్రాంతాల్లో పీడనం బయటకు వచ్చే ప్రమాదం పొంచి ఉందనీ... అది బయటకు వచ్చినప్పుడు భారీ భూకంపం వచ్చే ఛాన్స్ ఉందని పూర్ణ చంద్రరావు తెలిపారు. ప్రస్తుతం హిమాలయ పర్వతాల చెంత ఉన్న ఉత్తరాఖండ్ లోని జ్యోషిమఠ్ కుంగిపోతోంది కాబట్టి.. అక్కడ భూకంపం వచ్చే ఛాన్స్ ఉంటుందని ఆయన అంచనా వేశారు.
పూర్ణ చంద్రరావు ప్రకారం.. 1897, 1905, 1934, 1950లో హిమాలయాల చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర భూకంపాలు సంభవించాయి. 1934 తర్వాత నేపాల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో పెద్ద భూకంపం ఏదీ రాలేదు. అందువల్ల భూమి లోపల ఉన్న పీడనం ఏదో ఒక రోజు పైకి రాగలదు. అప్పుడు భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉంది. (image credit - twitter - @ANI)
టెక్నాలజీ వల్ల.. భూకంపాలు ఉత్తరాదిన ఎక్కువగా వస్తున్న విషయం తెలుస్తోంది. కానీ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం.. భూకంపాలను తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇళ్లన్నీ.. భూకంపం వస్తే కూలిపోయేవే తప్ప.. తట్టుకునే టెక్నాలజీతో వాటిని నిర్మించలేదు. అందువల్ల ఇండియాలో భారీ భూకంపం వస్తే.. ప్రాణ, ఆస్తి నష్టం కూడా ఉండగలదని నిపుణులు చెబుతున్నారు. (image credit - twitter - @ANI)