Covaxin: కోవాగ్జిన్ టీకా ధరను ప్రకటించిన భారత్ బయోటెక్.. కోవిషీల్డ్ కంటే ఎక్కువ

మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మే1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరూ టీకా వేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వారికి కూడా వ్యాక్సిన్ అమ్మాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే తమ వ్యాక్సిన్ రేట్లను ప్రకటించాయి.