Meat ban: మాంసం విక్రయాలు బంద్! ఆ నగరంలో మరోసారి...! ఈసారి ఎందుకో తెలుసా?
Meat ban: మాంసం విక్రయాలు బంద్! ఆ నగరంలో మరోసారి...! ఈసారి ఎందుకో తెలుసా?
అక్కడ మాంసం విక్రయాల్లో కోట్ల బిజినెస్ రన్ అవుతుంది.. వారం రోజులు గడవకముందే మరోసారి మీట్ బ్యాన్ వైపు అధికారులు అడుగులు వేశారు.. కొత్త సర్క్యూలర్ జారీ చేశారు.
చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీ సెంటర్లను ఆ రోజు తెరవకుండా బ్యాన్ చేశారు. ఇలా బ్యాన్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? వారం రోజులు గడవకముందే మరోసారి ఎందుకీ బ్యాన్..?
2/ 7
బెంగళూరు ప్రజలకు బీబీఎంపీ అధికారులు మరోసారి సర్క్యూలర్ జారీ చేశారు నాన్ వెజ్ కు సంధించిన అన్ని షాపులతో పాటుగా హోటల్స్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు.
3/ 7
ఎల్లుండు(మంగళవారం) మాంసం విక్రయాలు జరపకూడదని నోటీసులు పంపారు.. గత మార్చి 30న కూడా బెంగళూరులో నాన్ వెజ్ విక్రయించడాన్ని నిషేధించారు. ఈ నిషేధాన్ని ఎవరు అతిక్రమించినాగానీ కఠిన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ అధికారులు హెచ్చరించారు.
4/ 7
బెంగుళూరులోని నాన్‌వెజ్ ప్రియులు ఈ ఆర్డర్‌ను పాటించాలని తాజాగా అధికారులు మరోసారి ఆదేశించారు. బెంగుళూరు పౌరుల దృష్టికి, BBMP మాంసం విక్రయాలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జంతు వధ, మాంసం విక్రయాలను రానున్న మంగళవారం బ్యాన్ చేసింది
5/ 7
ఏప్రిల్ 4, మంగళవారం, మహావీర జయంతి సందర్భంగా, BBMP జంతు వధ, మాంసం విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాంసం కొనడం లేదా విక్రయించడం ఆ రోజు చేయకూడదని తెలిపింది.
6/ 7
ఐటీ హబ్ గా పేరుగాంచిన బెంగళూర్ లో నిత్యం కోట్లలో నాన్ వెజ్ బిజినెస్ జరుగుతుంటుంది.
7/ 7
ఇక కొన్నాళ్లుగా బెంగళూరులో ఇదే తరహా సర్క్యూలర్లు జారీ అవుతూనే ఉన్నాయి. ఆ మధ్య కృష్ణాష్టమి సందర్భంగా బెంగళూరు వ్యాప్తంగా మాంసం అమ్మకాలను నిషేధించారు. వినాయక చవితి పండగ సందర్భంగా కూడా బెంగళూరులో మాంసం అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు.