Bangalore: ఆ మహానగరాల్లో ఈసండే నో మటన్, నో చికెన్..ఎందుకంటే
Bangalore: ఆ మహానగరాల్లో ఈసండే నో మటన్, నో చికెన్..ఎందుకంటే
Bangalore:ఆదివారం నవమి రావడంతో బెంగుళూరులో మాంసం విక్రయాలు నిషేధించారు. మాంసం విక్రయించే షాపులే కాదు కభేళాలను సైతం మూసివేయాలని బృహత్ బెంగుళూరు మహానగర పాలికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దక్షిణ ఢిల్లీలో కూడా ఈనెల 11వ తేది వరకు మాంసం విక్రయం నిషేధం అమల్లో ఉంది.
లోక కల్యాణంగా జరుపుకునే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బెంగుళూరు మహానగరంలో ఈ ఆదివారం మాంసం షాపులు మూసివేయాలని బెంగుళూరు మహానగర పాలకే సంస్థ ఆదేశాలు జారీ చేసింది.
2/ 9
ఏటా దేశ వ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి నవమి ఆదివారం రావడం కారణంగా ఎలాంటి మాంస విక్రయాలు జరపకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
3/ 9
మాంసం షాపులు, చికెన్ సెంటర్లతో పాటు బెంగుళూరులోని కభేళాలను సైతం ఆదివారం మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు బీబీఎంసీ అధికారులు.
4/ 9
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బెంగుళూరులోని మాంసం విక్రయాలను నిషేధిస్తూ బృహత్ బెంగుళూరు మహానగర పాలికే ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
5/ 9
గతంలో గణేష్ చతుర్ది, మహాశివరాత్రి రోజుల్లో మాంసం విక్రయంపై నిషేధించడం గతంలో ఉంది. ఈ ఏడాది నుంచి శ్రీరామనవమి సందర్భంగా కూడా మాంసం విక్రయాలను చేపట్టకూడదని నిర్ణయించింది.
6/ 9
ఇప్పటికే దక్షిణ ఢిల్లీలో మాంసం విక్రయాలు నిషేధం అమల్లో ఉంది. నవరాత్రుల సందర్భంగా ఏప్రిల్ 4వ తేది నుంచి 11వ తేది వరకు దక్షిణ ప్రాంత ఢిల్లీలో ఎలాంటి మాంసం విక్రయించడానికి వీల్లేదేని మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశాలు జారీ చేశారు.
7/ 9
దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ నవరాత్రులన్ని రోజులు మాంసం ముట్టని ప్రాంతాలు ఉన్నాయి. ముుఖ్యంగా దక్షిణ ఢిల్లీలో అయితే 99 శాతం మంది వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినరని తెలుస్తోంది.
8/ 9
శ్రీరామనవమి ఆదివారం రావడంతో నాన్వెజ్ ప్రియులకు ఈసారి మాంసం వాసన తగలకుండానే సండే గడిచిపోతుంది. అయితే ఇదో రకంగా మంచిదేనంటున్నారు.
9/ 9
పవిత్రమైన పండగ రోజు..మరోవైపు మాంసం ధరలు కొండెక్కి కూర్చోవడంతో మాంస ప్రియులు ఈరకంగానైనా ఆదివారం అదనపు ఖర్చు తగ్గిపోయిందిలే అని కొందరు భావిస్తున్నారట.