కొవిడ్(Covid) కారణంగా దాదాపు అన్ని ఐటీ సంస్థలు(IT Compenies) ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం(Work From Home) అవకాశం ఇచ్చాయి. అయితే ప్రస్తుతం ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చి పడింది. పగటి పూట పని చేస్తున్న ఉద్యోగులు, తమ పని గంటలు అయిపోగానే ఎక్కువ ఇన్కమ్ కోసం రాత్రి మరో జాబ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
దీన్ని మూన్‌లైటింగ్ ఎఫెక్ట్ అంటున్నారు. దీంతో అసలు కంపెనీల రెవెన్యూ, ప్రొడక్టివిటీ దెబ్బతింటోందని ఐటీ సంస్థలు చెబుతున్నాయి. ఈ కారణాలతో ఉద్యోగులను(Employee) ఆఫీస్‌లకు పిలిపించాల్సిన అవసరం కలుగుతోందని చెబుతున్నాయి. వారంలో కొన్ని రోజులైనా ఆఫీస్‌లకు వచ్చేలా చూడాలని భావిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
దీనిపై ఓ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓ ఉద్యోగి ఒకే సారి ఏడు కంపెనీలకు పని చేస్తున్నాడని ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. అలా పని చేస్తున్న ఉద్యోగి ఎవరు, ఏ కంపెనీలకు పని చేస్తున్నాడనే విషయం కూడా తెలుసని, అతని పీఎఫ్ రికార్డులను పరిశీలిస్తే ఎంప్లాయిమెంట్ డీటైల్స్ కనిపిస్తాయని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
మరో కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇండియాలో ఉద్యోగులకు సంబంధించి సెంట్రలైజుడ్ డేటాబేస్ లేదని అన్నారు. దీంతో ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు చేసే మూన్లైటర్స్ని కనిపెట్టడం కష్టంగా మారుతోందని చెప్పారు. భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగులు ఎంప్లాయ్స్ ట్యాక్స్ ఫైలింగ్, పీఎఫ్ అకౌంట్లో ఇన్కమ్ శాలరీ అని ఉందా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్(Income From Other Sources) అని ఉందా చూసుకోవాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)