ఈ సమస్యను తొలగించాలని, ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచాలని ఆయా ప్రభుత్వాలు ఆదేశించాయి. కానీ పరిస్థితుల్లో గుర్తించదగిన మార్పు అయితే కనిపించలేదు. అయితే కర్ణాటకలోని బందెపాళ్య పోలీస్ స్టేషన్ ఈ సమస్యకు పరిష్కారం చూపింది. ప్రజలకు నమ్మకం కలిగించడంలో ముందడుగు వేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఓ ఫారమ్‌లో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు : ఒక సందర్శకుడు స్టేషన్‌కి వచ్చిన తర్వాత, అతనికి/ఆమెకు ఒక ఫారమ్ అందజేస్తారు. అందులో సందర్శన సమయం, ప్రయోజనం, సంప్రదించిన అధికారి, తీసుకున్న నిర్ణయం, స్టేషన్‌పై వారి అభిప్రాయం వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. స్టేషన్‌కు ఫీడ్‌బ్యాక్ అందించడానికి ఎక్స్లెంట్, వెరీగుడ్, గుడ్, యావరేజ్, పూర్ అనే ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
దీని గురించి ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడంలో సహాయం చేసిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ దీపక్ కంచి మాట్లాడుతూ.. ప్రజల నుంచి ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్ స్వీకరించాలనే బందెపాళ్య పోలీస్ స్టేషన్‌లోని ఇన్స్పెక్టర్ ఎల్వై రాజేష్, అతని బృందం ఆలోచనతో దర్పణ క్రియేట్ చేసినట్లు చెప్పారు. స్టేషన్ సందర్శించినప్పటి నుంచి చివరి వరకు ప్రజల పూర్తి అభిప్రాయం తెలుసుకునేలా ఫారమ్ ఉంటుందని పేర్కొన్నారు.
* యు రిఫ్లెక్ట్ అస్ అండ్ వి రిఫ్లెక్ట్ యు : ఈ కాన్సెప్ట్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు.. ఇప్పుడు విల్సన్ గార్డెన్లో ట్రాఫిక్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా ఉన్న సూర్యకాంత్ హట్టి, బందెపాళ్య పోలీస్ స్టేషన్లో రైటర్‌గా పనిచేశారు. ఫీడ్‌బ్యాక్ మెకానిజం రూపుదిద్దుకునేలా చూసుకోవడానికి డిజైన్ కోడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన దీపక్‌తో కలిసి పని చేయాలని ఇన్స్పెక్టర్ హట్టిని కోరారు.
సూర్యకాంత్ హట్టి మాట్లాడుతూ.. పోలీసులు, ప్రజల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడటానికి దర్పణకు ‘యు రిఫ్లెక్ట్ అస్ అండ్ వి రిఫ్లెక్ట్ యు’ అనే ట్యాగ్‌లైన్ ఉంటుందని చెప్పారు. ఈ మంచి ప్రయత్నంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభించినప్పటి నుంచి స్టేషన్ 270 మందికి పైగా వ్యక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించినట్లు తెలిపారు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చే సందర్శకుల ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా అక్నాలడ్జ్మెంట్ పంపే ఫీచర్‌ను కూడా తీసుకురావాలనే ప్రణాళికలు ఉన్నాయని వివరించారు.
* 15 రోజులకోసారి సమీక్ష : ప్రతి 15 రోజులకు ఒకసారి ఇన్స్పెక్టర్, సీనియర్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రజల రెస్పాన్స్‌ను సమీక్షిస్తారు. నెలవారీ స్టేషన్ పరేడ్‌లో ఉత్తమ సమీక్ష పొందిన పోలీసుకు రివార్డ్ అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని కొంత మంది ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందించారు. విషయం తెలుసుకొన్న DG&IGP ప్రవీణ్ సూద్ బందెపాళ్య సిబ్బంది ప్రయత్నాలను ప్రశంసించారు.