1. అయోధ్య తీర్పులో ప్రధానంగా 5 అంశాలున్నాయి. వివాదాస్పద భూమిపై హక్కులు ఉన్నాయంటూ నిర్మోహి అఖాడా చేసిన వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆ స్థలం తమదేనని షియా వక్ఫ్ బోర్డు వాదనను కొట్టేసింది. వివాదాస్పద అయోధ్య స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు ఇవ్వాలని ఆదేశించింది. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా స్థలాన్ని ఇవ్వాలని ఆదేశించింది. అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. (image: News18 Creative)
6. ఇక ఓసారి చరిత్రలోకి వెళ్తే 1528లో శ్రీరామ జన్మస్థానంగా భావిస్తున్న ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది. 1853లో అక్కడ మొదటిసారిగా మతకలహాలు చెలరేగాయి. 1859లో హిందువులు, ముస్లింలకు మార్గాలను వేర్వేరుగా మారుస్తూ ఫెన్స్ నిర్మించారు. 1949లో మసీదు లోపల సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. దీంతో ఆ స్థలాన్ని వివాదాస్పదంగా ప్రకటించింది ప్రభుత్వం. 1984లో వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని నిర్మించాలని హిందూ సంస్థలు కమిటీని ఏర్పాటు చేశాయి. 1986లో వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులకు అనుమతి ఇచ్చింది కోర్టు. దానికి నిరసనగా ముస్లింలు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. 1989లో బాబ్రీ మసీదు సమీపంలో రామాలయ నిర్మాణానికి వీహెచ్‌పీ శంకుస్థాపన చేసింది. 1990లో బీజేపీ అధ్యక్షుడు లాల్ కిషన్ అద్వానీ రామ్ రథ యాత్రను ప్రారంభించారు. 1992లో మసీదును కూల్చివేయడంతో దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల అల్లర్లు చెలరేగాయి. (image: News18 Creative)
7. 1992లో లిబర్హన్ కమిషన్ ఏర్పాటైంది. 2010లో అలాహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలాన్ని ముగ్గురికి పంచాలని తీర్పు చెప్పింది. 2011లో సుప్రీం కోర్టు ఈ రూలింగ్‌ను సస్పెండ్ చేసింది. 2017లో కోర్టు బయట వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని కోరింది సుప్రీం కోర్టు. 2019 మార్చిలో మధ్యవర్తిత్వాన్ని ప్రతిపాదించింది సుప్రీం కోర్టు. 2019 ఆగస్టులో మధ్యవర్తిత్వం విఫలమైంది. 2019 ఆగస్ట్‌లో మళ్లీ విచారణ మొదలుపెట్టింది సుప్రీం కోర్టు. 2019 అక్టోబర్‌లో వాదనలు ముగిశాయి. 2019 నవంబర్ 9న అయోధ్య కేసుపై తీర్పు వచ్చింది. (image: News18 Creative)