వందల ఏళ్ల పోరాటాలు, త్యాగాల తర్వాత ఎట్టకేలకు శ్రీరాముడు తన జన్మస్థలంలో ఆశీనుడయ్యే రోజు రానే వచ్చింది. సరిగ్గా 11 నెలల తర్వాత.. రామ్ లాలా తన గర్భగుడిలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ కారణంగా... రామ్ లాలా విగ్రహాన్ని తయారుచేయడానికి నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి రెండు భారీ రాళ్ళు (గండకీ నది శిలలు)... పవిత్ర నగరమైన అయోధ్యకు చేరుకున్నాయి. అయితే రాళ్లపై మత విశ్వాసాలు, రామభక్తుల విశ్వాసం కారణంగా ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది.
వాస్తవానికి, జనక్‌పూర్‌లోని జానకి ఆలయ మహంత్, నేపాల్ ఉప ప్రధాన మంత్రి సమక్షంలో.. రెండు శాలిగ్రామాలను.. శిలా ట్రస్ట్ ఆఫీస్ బేరర్లకు అప్పగించారు. ఆ రెండు రాళ్లను రెండు ట్రక్కులలో అయోధ్యకు తీసుకొచ్చారు. ఐతే రాళ్లపై మత విశ్వాసాలకు సంబంధించి కొత్త వివాదం తలెత్తింది. ఆ మత విశ్వాసం, కొత్త వివాదాలను కొన్ని చిత్రాల ద్వారా మీకు వివరిస్తాం.