అయోధ్యలో 2023 డిసెంబర్ నాటికి రామాలయ నిర్మాణం పూర్తవుతుంది. అంతకంటే ముందుగానే ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఇది రామాలయానికి 7కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలుస్తోంది. అందువల్ల ఎయిర్పోర్ట్ నుంచి రామజన్మభూమికి భక్తులు నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా చాలా త్వరగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కలుగనుంది.