ఛత్తీస్గఢ్.. కోర్బా జిల్లాలోని సుతార్రా గ్రామంలో ఓ వింత జీవి కనిపించింది. అది అరుదైన జంతువైన అడవిపిల్లి ( Palm Civate). అది ఓ ఇంట్లో దాక్కుంది. దాన్ని చూసి మొదట ఇంట్లో వాళ్లకు అదేం జంతువో అర్థం కాలేదు. కానీ దాని అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ జంతువు మలంలో లభించే కాఫీ గింజలతో కాఫీ తయారుచేస్తారనీ.. అది ప్రపంచంలోనే ఖరీదైన కాఫీలలో ఒకటి అని తెలిసి షాకయ్యారు.
అడవిపిల్లి ఇంట్లోకి రావడం చూసిన వెంటనే ఇంటి యజమాని నాగు... తన స్నేహితుడు జితేంద్ర సారథికి కాల్ చేశాడు. వెంటనే ఆ ఇంటికి వచ్చిన జితేంద్ర దాని గురించి వివరాలు చెప్పాడు. అది ఎవరికీ హాని చెయ్యదని చెప్పాడు. తర్వాత అటవీ అధికారులు ఇంట్లోకి వచ్చి.. ఆ పిల్లిని పట్టుకొని.. అడవిలో సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టారు.