Ashika Ranganath: నదిలో కొత్త నీళ్లు ఎలాగో.. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ కోవలో కన్నడలో ఇప్పటికే హీరోయిన్గా సత్తా చూపిస్తోన్న ఆషికా రంగనాథ్.. ఇపుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. (Twitter/Photo)
ఆషికా రంగనాథ్ .. తుముకూరులో బిషప్ సార్గంట్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత బెంగళూరులో ప్రీ జ్యోతి నివాస్ కాలేజీలో చదివారు. ఆ తర్వాత 2014 మిస్ ఫ్రెస్ ఫేస్ బెంగళూరుగా ఎంపికైంది. అంతేకాదు చిన్నప్పటి నుంచి వివిధ నృత్య రీతులను నేర్చుకుంది. ఇక హీరో సిద్ధార్ధ్ అంటే ఇష్టమని పలు సందర్భాల్లో ప్రస్తావించింది. మొత్తంగా అమిగోస్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ భామ ఇక్కడ కూడా సత్తా చూపెడుతుందా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)