తీవ్ర తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. జిల్లా ముక్కాం తీరంలో సముద్రం 20 మీటర్ల మేర ముందుకొచ్చింది. రాయలసీమలోనూ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. బాపట్ల జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.