తెల్లారితే మన ప్రకృతి తరిగిపోతుందనే బాధ మనందరిలోనూ ఉంటుంది. మానవ అవసరాల కోసం చెట్లను నరికేస్తుంటే.. అనేక జంతువులు, పక్షులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ సంరక్షణ కోసం ఎంతో మంది తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. అలా ఓ వ్యక్తి.. చెట్లను కాపాడేందుకు... చెట్ల ద్వారానే సందేశం ఇస్తూ.. అందర్నీ ఆకర్షిస్తున్నారు.
వాతావరణంలో చాలా చెట్లు పెరుగుతాయి. అయితే ఆ చెట్లు ఇప్పుడు కళాకారులకు కాన్వాస్‌గా మారాయి. హబ్రాలోని బనిపూర్ ప్రాంతానికి చెందిన ఆర్టిస్ట్ సంజయ్ సర్కార్ ఈ చెట్లకు భిన్నమైన రూపాన్ని అందించారు. చుట్టుపక్కల చెట్లు నాశనమవుతున్న వేళ, చెట్లను రక్షించాలనే సందేశంతో పాటు చెట్లపై వివిధ పర్యావరణ సృజనాత్మక దృశ్యాలను చిత్రించాడు.