2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం బాగా పెరిగింది. దాదాపు అన్ని రంగాల్లో ఇది ఉంది. దీని పరిధిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత సైన్యంలో కూడా కృత్రిమ మేథస్సు (AI) త్వరలో సైన్యానికి సహాయకారిగా ఉండబోతోంది. రక్షణ శాఖ అధికారిక సమాచారం ప్రకారం.. సైనికులు ఆపరేషన్స్ చేసే సమయంలో.. AI కూడా వారితోపాటూ రంగంలోకి దిగుతుంది. ఫలితంగా శత్రువుల్ని ఈజీగా అంతమొందించగలరు. ఇందుకోసం ఇండియన్ ఆర్మీకి.. త్రెట్ అసెస్మెంట్ సాఫ్ట్‌వేర్‌ని ఇస్తారు. ఇది AI ఆధారితంగా పనిచేస్తుంది. దీనికి నేషనల్ డేటాబేస్లు అయిన UIDAI, MoRTHతో లింక్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సాఫ్ట్వేర్ నిరంతరం పనిచేస్తూ.. కదలికలను గమనిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా, ఏ వాహనమైనా కదులుతూ ఉంటే.. సైనికుల్ని అలర్ట్ చేస్తుంది. తద్వారా సైనికులకు శత్రుమూకల కదలికలు స్పష్టంగా తెలుస్తాయి. యుద్ధ రంగంలోనే కాదు.. ఈ సాఫ్ట్వేర్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పైనా కన్నేస్తుంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే లింక్స్, సందేశాల్ని ఈ టెక్నాలజీ గుర్తించి.. సైన్యానికి సమాచారం ఇస్తుంది. ఇలా ఆపరేషన్స్‌లో సైనికులకు పూర్తి రక్షణగా నిలుస్తుంది ఈ సాఫ్ట్వేర్.
AIలో ఏముంటాయి? : మామూలు సాఫ్ట్‌వేర్‌కీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కీ ప్రధాన తేడా ఉంది. మామూలు సాఫ్ట్వేర్ తనకు తానుగా అప్డేట్ అవ్వదు. AI మాత్రం ప్రతీ క్షణం అప్డేట్ అవుతూ ఉంటుంది. రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటూ... చిన్న పిల్లాడిలా అన్నీ నేర్చుకుంటుంది. అందుకే అది మనిషిలా ఆలోచించగలుగుతుంది. సైన్యానికి ఇచ్చే AI ప్రత్యేకమైన సిమ్యులేషన్. ఇందులో ఎక్స్పర్ట్ సిస్టమ్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్ రికగ్నిషన్, మెషిన్ విజన్ వంటివి ఉంటాయని తెలుస్తోంది.
సిక్కిం వంటివి సున్నిత ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ AI వాడకం పెరగనుంది. తద్వారా టాస్కులు తేలిగ్గా, వేగంగా పూర్తి కాగలవు." width="1920" height="1440" /> ఇండియాలో హిమాలయాలు, ఉత్తర కాశ్మీర్, తూర్పు సిక్కిం వంటివి సున్నిత ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ AI వాడకం పెరగనుంది. తద్వారా టాస్కులు తేలిగ్గా, వేగంగా పూర్తి కాగలవు.
ఇండియన్ ఆర్మీ .. టెక్నాలజీని బాగా వాడుకుంటూ.. శత్రుమూకల పనిపట్టనుంది." width="1920" height="1280" /> యుద్ధాలు, ఆపరేషన్లకు మాత్రమే కాకుండా.. AIతో కలిగే ఇతర ప్రయోజనాలను కూడా సైనికులకు కల్పించేందుకు కేంద్ర రక్షణ శాఖ ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. తద్వారా సమీప భవిష్యత్తులో ఇండియన్ ఆర్మీ.. టెక్నాలజీని బాగా వాడుకుంటూ.. శత్రుమూకల పనిపట్టనుంది.