అమ్మ జయలలిత అనారోగ్యంతోనే మరణించారని, అయితే, దీనిని రాజకీయం చేశారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ అన్నారు. ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, అపోలో వైద్యులు గతంలోనే అమ్మ మరణంపై స్పష్టత ఇచ్చారని, రాజకీయ దురుద్దేశంతోనే విచారణ కమిషన్ పేరిట ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారని దినకరన్ ఆరోపించారు.