Himachal Landslides: ఆర్టీసీ బస్సుపై విరిగిపడిన పెద్ద పెద్ద బండరాళ్లు.. శిథిలాల కింద 40 మంది
Himachal Landslides: ఆర్టీసీ బస్సుపై విరిగిపడిన పెద్ద పెద్ద బండరాళ్లు.. శిథిలాల కింద 40 మంది
Himachal Pradesh Landslide: హిమాచల్ ప్రదేశ్లో మరోసారి కొండచరియలు బీభత్సం సృష్టించాయి. కిన్నౌర్ జిల్లాలో కొండల పై నుంచి పెద్ద పెద్ద బంగరాళ్లు విరిగిపడి రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. ఈ ఘటన పలు వాహనాలు ముక్కలు ముక్కలయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. కిన్నౌర్ జిల్లా నిగుల్సేరి ప్రాంతంలో NH-5పై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈగిల్ ఫారెస్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
2/ 5
పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడడంతో HRTC బస్సుతో పాటు మరికొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండ చరియల శిథిలాల కింద 35 నుంచి 40 మంది చిక్కుకున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు.
3/ 5
సమాచారం అందిన వెంటనే ఐటీబీపీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకుంటున్నాయి.
4/ 5
బంగరాళ్ల కింద ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఐతే ఆ బస్సులో ఎంత మంది ఉన్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది. వారిని కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
5/ 5
జులై 25న ఇదే కిన్నౌర్ జిల్లాలోని సంగ్లా-చిత్కుల్ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. పర్యాటకుల వాహనంపై బండరాళ్లు పడడంతో 9 మంది మరణించారు. తాజాగా మరోసారి భారీగా కొండ చరియలు విరిగిపడడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.