సందర్శకులను ఆకట్టుకుంటున్న ప్లెమింగో ఫెస్టివల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లెమింగో ఫెస్టివల్ చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ ప్లెమింగో ఫెస్టివల్‌ను వీక్షించడానికి దేశ విదేశాలనుండి అతిథులు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చేరుకున్నారు. ప్రభుత్వం కూడా తగిన వసతులను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఫెస్టివల్‌ను చూడడానికి వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి.
1/ 8


ఈ సీజన్లో దేశ విదేశాలనుండి వచ్చిన దాదాపు 90000వేల పక్షులు పులికాట్ సరస్సు ప్రాంతంలో తమ గూళ్ళను ఏర్పరచుకుంటాయి.
2/ 8


దీంతో పక్షి ప్రియులు వాటిని చూడడానికి ఆసక్తిచూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయడంతో పులికాట్ సరస్సు కొత్త శోభను సంతరించుకుంది.
4/ 8


చెట్లపై గూళ్ళను ఎర్పరచుకుంటున్న పక్షులు.. ఈ సీజన్లో ఇక్కడి పొడి వాతావరణం.. ఈ ప్లెమింగోలకు పిల్లలను పెంచడానికి సరైన సమయం.
5/ 8


అందుకే వేల కిలోమీటర్ల నుండి వచ్చి ఇక్కడ పిల్లలను కని.. ఎదిగాక మళ్లీ వాటి సొంత అవాసంకు వెళ్లిపోతాయి.