వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మిల్లెట్ లంచ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒకే డైనింగ్ టేబుల్ పై కూర్చొని చిరుధాన్యాల ప్రత్యేక వంటకాలను తిన్నారు. పరస్పరం ఛలోక్తులు విసురుకుంటూ మాట్లాడుకున్నారు.
ఈరోజు జరిగిన పార్లమెంటరీ సమావేశంలో మిల్లెట్ నాణ్యత, ప్రత్యేకతను ప్రోత్సహించడంపై కూడా ఉద్ఘాటించారు. వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌తో కలిసి పార్లమెంట్లో పూల హారతిని ఆయన పరిశీలించారు. మిల్లెట్‌తో తయారైన తుది ఉత్పత్తులను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ, ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ కర్ కూడా ఉన్నారు. మిల్లెట్ ఉత్పత్తుల నాణ్యతను ప్రధాని ఎప్పుడూ ఆరాధించేవారు. 2018 సంవత్సరంలో, భారత ప్రభుత్వం బజ్రాను పోషకాహార మిషన్ పథకంలో పోషక ధాన్యంగా చేర్చింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజస్తాన్ లో చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ, సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసిన నేపథ్యంలో ఖర్గే, ప్రధాని మోదీ ఒకే చోట కూర్చుని సంతోషంగా గడిపారు. తృణ ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాల విందు సందర్భంగా వీరిద్దరూ కలిసి సరస సంభాషణలతో అందరినీ ఆకట్టుకున్నారు.
సోమవారం రాజస్తాన్ లోని ఆల్వార్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని..బీజేపీ కనీసం ఓ శునకాన్ని అయినా పోగొట్టుకోలేదని చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు.