డింపుల్ యాదవ్ రెండు డోసుల టీకాను పొందినప్పటికీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాత్రం ఇప్పటిదాకా వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో కరోనా బారినపడి కోలుకున్న ఆయన ఇప్పటిదాకా టీకా తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు భారీగా ఉండే అవకాశముంది.