అంబానీ స్క్వేర్‌లో మ్యూజికల్ ఫౌంటెన్ షో..ఆర్మీ కుటుంబాల కోసం గ్రాండ్ ఈవెంట్

ఆకాశ్ అంబానీ వివాహ వేడుకల సందర్భంగా ముంబైలో సాయుధ బలగాల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసింది అంబానీ ఫ్యామిలీ. ధీరూబాయి అంబానీ స్వ్వేర్‌లో మ్యూజికల్ ఫౌంటెన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలర్‌ఫుల్ వాటర్ ఫౌంటెన్, మ్యాజికల్ బృందావన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.