దుబాయ్ నుంచి కేరళలోని కాలికట్ (కోజికోడ్) వెళ్తున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. రన్ వే మీద ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విమానం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వే మీద నుంచి పక్కకి దూసుకుపోయింది. కేరళలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రాధమిక సమాచారం మేరకు ఓ పైలెట్ చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కేరళ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం కేరళ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం కేరళ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం కేరళ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం