Plane Crash: ఘోర ప్రమాదం.. ఆలయ గోపురాన్ని ఢీకొట్టి కుప్పకూలిన విమానం..
Plane Crash: ఘోర ప్రమాదం.. ఆలయ గోపురాన్ని ఢీకొట్టి కుప్పకూలిన విమానం..
Rewa Plane Crash: మధ్యప్రదేశ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ట్రైనీ విమానం అదుపు తప్పి.. ఆలయ గోపురాన్ని ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆకాశంలో అదుపుతప్పిన ఓ ట్రైనీ విమానం ఆలయ గోపురాన్ని ఢీకొని కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ అక్కడికక్కడే మరణించారు. మరొకరు గాయపడ్డారు.
2/ 7
రేవా జిల్లాలోని డుమ్రీ గ్రామంలో శుక్రవారం తెల్లవారుఝామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన మరో పైలట్‌ను రేవాలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
3/ 7
విమానం మొదట ఓ ఆలయ గోపురాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను తాకుతూ కూలిపోయింది. ఓ ఇంటి ఆవరణలో కింద పడిపోయింది. భారీ శబ్ధంతో విమానం కూలిపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
4/ 7
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఓ పైలట్ మరణించాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
5/ 7
ప్రమాదానికి గురైన విమానం పల్టాన్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ఈ విమానంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. విమాన పైలట్ కెప్టెన్ విమల్ కుమార్ .. సోను అనే విద్యార్థికి ట్రైనింగ్ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
6/ 7
చోర్హాతా ఎయిర్‌స్ట్రిప్ నుంచి విమానం గాల్లోకి ఎగిరిందని.. ఓ విద్యార్థికి ట్రైనింగ్ ఇస్తుండగా కూలిపోయిందని రెవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. ప్రమాదం అనంతరం విమానం శకలాలు చెల్లా చెదురుగా పడిపోయాయి.
7/ 7
ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు వెల్లడించారు.