Kerala Plane Crash : జనరల్‌గా ఆకాశం నుంచి కూలిపోయే, కాలిపోయే విమానాల్లో బ్లాక్ బాక్సులు లభించే అవకాశం తక్కువ. కానీ... కేరళలోని కోజికోడ్ ఎయిర్‌పోర్టులో... విమానం కాలిపోలేదు కాబట్టి... అందులో ఫ్లైట్ డేటా రికార్డర్లను (బ్లాక్ బాక్సులు) అధికారులు కనిపెట్టారు. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR)... ఈ రెండూ కీలకమైన సమాచారాన్ని స్టోర్ చేస్తాయి. DFDR అనేది విమానం ఎలా వెళ్లింది, ఏం జరిగిందో చెబుతుంది. CVR అనేది పైలట్లు ఏం మాట్లాడారు, ఏమనుకున్నారు, ప్రయాణికులకు ఏం చెప్పారు వంటి అన్ని మాటల్నీ రికార్డ్ చేసి ఉంచుతుంది. అందుకు తగ్గట్టుగానే పైలట్లు కూడా... ప్రమాదం జరిగే సమయంలో... ఏం జరుగుతుందో ప్రతీదీ CVRలో రికార్డ్ అయ్యేలా అరుస్తారు. తద్వారా ప్రమాదం తర్వాత తమ ప్రాణాలు పోయినా... వాస్తవమేంటో ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో అలా చేస్తారు. నిన్నటి విమాన ప్రమాదంలో ప్రయాణికులతోపాటూ... పైలట్, కోపైలట్ కూడా చనిపోయినట్లు తెలిసింది. అందువల్ల ప్రమాదం ఎలా జరిగిందో తెలియడానికి DFDR, CVR కీలకంగా మారాయి. (credit - twitter - ANI)
DFDR, CVRని పరిశీలించనున్న అధికారులు... విమానం ఎంత ఎత్తు నుంచి, ఎంత వేగంతో కిందకు ల్యాండ్ అయ్యిందో తెలుసుకుంటారు, ల్యాండ్ అయ్యేటప్పుడు ఏ పొజిషన్లో ఉందో, ఎంత వేగంతో రన్‌వే పై దూసుకెళ్లిందో తెలుసుకుంటారు. ఆ టైంలో పైలట్లు ఏమనుకున్నారో తెలుసుకుంటారు. ఈ డేటాను విశ్లేషించడం ద్వారా... ప్రమాద పూర్తి వివరాలు తెలియనున్నాయి. దీనిపై DGCA అధికారులు మరోసారి భేటీ కాబోతున్నారు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరీ... మధ్యాహ్నం కోజికోడ్ రానున్నారు. దర్యాప్తు వివరాల్ని ఆయన తెలుసుకోనున్నారు. (credit - twitter - ANI)
శుక్రవారం రాత్రి 7:40 గంటలకు 191 మందితో... ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం... కోజికోడ్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ల్యాండ్ అవుతూ... పక్కకు జారిపోయింది. ఇందుకు కారణం... కేరళలో జోరు వర్షాలు పడుతుంటే... రన్‌వే తడిగా ఉంది. అందువల్లే టైర్లు జారి... విమానం పక్కకు వెళ్లి... కుదుపులకు లోనై... 50 అడుగుల లోయలోకి జారి... రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్ సహా... 20 మంది ప్రాణాలు కోల్పోయారు. (credit - twitter - ANI)
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737 ఐఎక్స్ 1344, ఎక్స్‌ప్రెస్ విమానం... ‘వందే భారత్’లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. దుబాయ్ నుంచి పది మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఏడుగురు సిబ్బందితో కొజికోడ్ బయలుదేరింది. ప్రమాదానికి ముందు... రెండుసార్లు ల్యాండింగ్ కోసం ప్రయత్నించి... ఆకాశంలోనే రౌండ్లు వేసింది. మూడోసారి ల్యాండ్ అవుతూ... ప్రమాదంలో చిక్కుకుంది. కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్ అవ్వడం వల్లే విమానం కంట్రోల్ తప్పిందనే వాదన వినిపిస్తోంది. రాత్రంతా సహాయ చర్యలు జరిగాయి. తీవ్రంగా గాయపడిన 15 మందినీ, స్వల్పంగా గాయపడిన 123 మందిని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. (credit - twitter - ANI)