Home » photogallery » national »

AHEAD OF AKASH AMBANI AND SHLOKA MEHTA WEDDING FAMILY CELEBRATES WITH ANNA SEVA SK

అంబానీ ఇంట పెళ్లి సందడి...అనాధాశ్రమాలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార సామాగ్రి

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలు ముంబైలో ఘనంగా ప్రారంభమమ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అన్నసేవా కార్యక్రమం నిర్వహించి అనాథ పిల్లలకు భోజనం వడ్డించారు. ముంబైలోని అనాథ, వృద్ధాశ్రమాలకు ఏడాది పాటు ఆహార సామాగ్రిని ఉచితంగా అందజేస్తామని ఈ సందర్భంగా నీతా అంబానీ వెల్లడించారు. అటు ముంబైలో ధీరూబాయ్ అంబానీ స్క్వేర్‌‌ను ప్రారంభించి ముంబైకర్లకు అంకితమిచ్చారు. మార్చి 11 వరకు అంబానీ ఇంట పెళ్లి సంబరాలు జరగనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను ఆకాశ్ పెళ్లాడుబోతున్నారు.