ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిల్లో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తద్వారా నాలుగో వేవ్ ముప్పు ఉండదనే హింట్ ఇచ్చినట్లయింది.(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా పరిస్థితుల్లో మెరుగుదలతో పాటు మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వైరస్ వ్యాప్తిని కట్టడికి రాష్ట్రాలు సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. కేసులూ తగ్గాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిబంధనల ఎత్తివేత నిర్ణయానికి వచ్చామని కేంద్రం తన లేఖలో పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
కొవిడ్ కట్టడికి విపత్తు నిర్వహణ చట్టం కింద ఉన్న నిబంధనలు మరింతకాలం పొడగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నామని, మార్చి 31న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుందని, ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)