రాజకీయ నాయకుల్లో చాలా మంది పోలీస్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను లెక్క చేయరు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ విషయంలో అదే జరిగింది. ఆయనపై నమోదైన ఓ కేసులో ఆయనతో మాట్లాడేందుకు బీహార్ పోలీసలు పంజాబ్.. అమృత్సర్లోని ఆయన ఇంటికి వచ్చారు. ఆ సమయంలో సిద్ధూ ఇంట్లో లేరు.