కాశ్మీర్లో తులిప్ గార్డెన్ ఇప్పుడు మరోసారి ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటోంది. పాలమూరులోని సీఎస్ఐఆర్-ఐహెచ్బీటీ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల కృషి ఫలితమే ఈరోజు కశ్మీర్‌కు ప్రత్యేక శోభ సంతరించుకుందని చెప్పాలి. తులిప్ జాతికి చెందిన 11 రకాలకు చెందిన 50 వేల పూల మొక్కల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవే ఇప్పుడు టి గార్డెన్ సిటీ పాలంపూర్‌లో ప్రత్యేక ఆకర్షణీయంగా మారాయి. ఈ పూల తోటను రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ సందర్శించి తీపి గుర్తుగా ఫోటోలు తీసుకున్నారు.
తులిప్ గార్డెన్ అందాలు చూసేందుకు పాలంపూర్లోని సీఎస్ఐఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీకి టూరిస్టుల తాకిడి పెరిగింది. ప్రకృతి అందాలు చూడాలనుకునే వారికి కాశ్మీర్ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని తులిప్ గార్డెన్ ఉన్న పాలంపూర్ తప్ప మరో ప్లేస్ లేదంటే అతిశయోక్తి కాదు. ఇది దేశంలోనే రెండో తులిప్ గార్డెన్‌గా పేరు గాంచింది. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ డెవలప్ చేసింది. ఈ గార్డెన్‌లోని తులిప్ పూల మొక్కలన్ని పూర్తిగా స్వదేశీ రకాల నుంచి అభివృద్ది చేసినవే. లాహౌల్-స్పితిలో కూడా దీని మొక్కలు తయారు చేస్తున్నారు.
ఇక్కడున్న తులిప్ జాతి పూలు హాలండ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఇప్పటివి కాదు 1554 సంవత్సరంలో టర్కీలో మొట్టమొదటి సారిగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత క్రీ.శ.1554లో ఆస్ట్రియాకు, తర్వాత క్రీ.శ.1571లో హాలండ్‌లో దర్శనమిచ్చాయి. క్రీ.శ.1577లో ఇంగ్లండ్‌లో ఈ తులిప్ మొక్కలున్నట్లుగా చరిత్ర చెబుతోంది. తులిప్ పూల మొక్కల చరిత్రకు సంబంధించి గెస్నర్ అనే చరిత్రకారుడు 1559లో ఓ పుస్తకంలో వీటి వివరాల్ని పొందుపర్చాడు. ఇంత అందమైన పూల మొక్కపై క్రమంగా ఇతర దేశాలకు మక్కువ పెరగడంతో యూరప్ అంతటా విస్తరించి నేడు దేశ, విదేశాల్లో తన కీర్తిని చాటుుకుంటోంది.
తులిప్ పువ్వు మందంగా పెద్దగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా ఉంటూ ప్రజల చూపులను తనవైపుకు తిప్పుకుంటుంది. ఈఫ్లవర్ డిజైన్‌కి దేశమే కాదు యావత్ ప్రపంచ దేశాలు సైతం ఫిదా అయ్యాయి.వీటిలో కూడా అనేక జాతులు ఉన్నాయి. పాలమూరులోని CSIR IHBT ఇన్స్టిట్యూట్లో 11 రకాలకు చెందిన 50,000 తులిప్ మొక్కలను బల్బులుగా కూడా పిలుస్తారు. గతేడాది ఇక్కడ సుమారు 28 వేల మొక్కలు నాటారు. ఈసారి 50 వేలు నాటడంతో టూరిస్టులు ఈ అందాల్ని చూడటానికి క్యూ కడుతున్నారు.
తులిప్ మొక్కలు మన దగ్గర ఎక్కువగా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడి వాతావరణం, ప్రకృతి అనుకూలించకపోవడం వల్ల వీటి మనుగడ కష్టంగా మారింది. అయితే గత ఐదేళ్లుగా ఈ పూల మొక్కల అభివృద్ధి చేస్తున్న రీసెర్చ్ ఫలితంగా ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తులిప్ బల్బులను తయారు చేయడంలో సంస్థ సక్సెస్ అయిందని CSIR- హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోరిసోర్స్ టెక్నాలజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భవ్య భార్గవ తెలిపారు. దాని కారణంగానే తులిప్ పూలకు బాగా డిమాండ్ పెరిగింది. రైతులైతే పొలాల్లో నాటితే వారి ఆదాయం రెట్టింపు అవుతోంది.
ఈ ఏడాది జూన్ నెలలో లెహ్‌లో తులిప్ గార్డెన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విదేశాల నుంచి తెచ్చే తులిప్ మొక్కలపై ఆధారపడకుండా స్వదేశీ మొక్కలను అభివృద్ధి చేసేందుకు ఇన్స్టిట్యూట్ ప్రయత్నిస్తోంది. తులిప్ బల్బులను లెక్కించడానికి ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతున్నారు. గతంలో తులిప్ గార్డెన్ చూడాలంటే శ్రీనగర్ వెళ్లాల్సి ఉండేది..ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు.