Tamilnadu CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) పరి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. పాలన పరంగా అనుభవం లేదు. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా తనదైన స్టైల్లో్ అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నారు. సమ న్యాయం చూపుతున్నారు. ఎక్కడా అధికారదర్పం కనిపించనీయడం లేదు. తనదైన మార్కు పాలనతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా చెంగల్పట్టు జిల్లాకు చెందిన నరికురవర్, ఇరుల తెగకు చెందిన 282 మందికి 4.53 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు ప్రకటించారు స్టాలిన్. మామళ్లపురంలోని ఆలయంలో అశ్విని అనే మహిళకు అన్నదానం చేసేందుకు నిరాకరించారు. ఆ మహిళను సీఎం స్టాలిన్ స్వయంగా గురువారం కలిశారు. అశ్విని ఆహ్వానం మేరకు స్టాలిన్ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెతో కాసేపు మాట్లాడారు.
10 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో అశ్విని.. తమ సీఎం స్టాలిన్ కు థ్యాంక్స్ చెప్పింది. ఇప్పుడు తమకు ఓటర్ ఐడీ, ఆధార్, రేషన్ కార్డులు అందాయన్నారు. ఇదంతా ఒక కలలా ఉందని ఆమె అన్నారు. సాధారణంగా రేషన్ కార్డు కావాలంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ నాలుగు నెలలు పాటు తిరగాల్సి వచ్చేదన్నారు. అలాంటిది సీఎం స్టాలిన్ కారణంగా కేవలం రెండు రోజుల్లోనే రేషన్ కార్డు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
చెంగల్పట్టులో నరికురవర్, ఇరుల వర్గానికి చెందిన 282 మంది వ్యక్తులకు రూ.4.53 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను సీఎం స్టాలిన్ అనౌన్స్ చేశారు. అంతేకాదు 10 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇళ్ల బాండ్స్, ఫ్యామిలీ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికెట్స్, వెల్ఫేర్ బోర్డు కార్డులు, బ్యాంకు లోన్లు అందజేశారు. సిటీ డెవలప్ మెంట్ ప్లాన్ అప్రూవ్ చేశారు. అంగన్ వాడీ, క్లాస్ రూమ్ ల నిర్మాణాలకు ఆదేశాలు ఇచ్చారు స్టాలిన్.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎం.కే స్టాలిన్ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ముందుకు వెళుతున్నారు. ఆ మధ్య అర్థరాత్రి ఓ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఆయన, ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ అవాక్ చేశారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న రోడ్డుపై తన కాన్వాయ్ వెళ్తుండగా వెనుకనుంచి వస్తున్న అంబులెన్స్‌కు సైడ్ ఇచ్చి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
తాజాగా నేరుగా బాధితురాలి దగ్గరకే వెళ్లి పథకాలు అందించారు. ఇలా ఊహించని రీతిలో తనదైన శైలితో సీఎం స్టాలిన్ ముందుకు సాగుతున్నారు. తాజాగా మరో అదిరిపోయే సీన్ చూడోచ్చు.. చెంగల్పట్టు జిల్లా తిరుక్కలుక్కుంరం సర్కిల్, పూన్చేరిలో నివాసముంటున్న నరిక్కువర్, ఇరులర్ వర్గానికి చెందిన 282 మంది లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ సహాయాన్ని సీఎం స్టాలిన్ అందించారు.