బాలీవుడ్ హీరోయిన్ పరిణితిచోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి జీవించబోతున్నారనే విషయాన్ని మరో ఎంపీ సంజీవ్ అరోరా కన్ఫామ్ చేశారు. రీసెంట్గా ఎంపీ రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసి వాళ్లను ఆశీర్వదిస్తూ పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.(Photo:Twitter)
ముంబైలో ఒకసారి..మరోసారి ఢిల్లీలో పరిణితిచోప్రా, రాఘవ్ చద్దా కలిసి ఉన్న వీడియో, ఫోటోలతో పాటు ..సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారనే వార్తలపై పుకార్లు షికార్లు చేశాయి. చివరకు రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధనకర్ సైతం మీ ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో బాగా రూమర్లు వస్తున్నాయని పార్లమెంట్ వేదికగా అఢిగారు. (Photo:Instagram)
ఆయితే రాఘవ్చద్దా, పరిణితి చోప్రా మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? వీళ్లిద్దరికి ఎక్కడ పరిచయం అయిందనే వార్తలపై కూడా కొంత సమాచారం ఉంది. లండన్లో నిర్వహించిన అవుట్ స్టాండర్స్ అచీవర్స్ అవార్డు అందుకునేందుకు వెళ్లిన సమయంలో వీరిద్దరూ అక్కడ కలుసుకున్నారు.అంతే కాదు ఒకే యూనివర్సిటీలో చదువుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.(Photo:Instagram)
మరి ఈ స్టార్ జోడి మధ్య చాలా రోజులుగా నడుస్తున్న ప్రేమ వ్యవహారం తాజాగా బయటపడినప్పకిటి ..ప్రేమించుకోవడం కంటే త్వరగా పెళ్లి చేసుకొని వార్తలకు స్వస్తి చెప్పడం బెటరన్ అని ఈజంట భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే రాఘవ్ పార్లమెంట్ దగ్గర మీడియా అఢిగిన ప్రశ్నకు అదే సమాధానం చెప్పారు. (Photo:Instagram)
ఎంపీ రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా రెండు కుటుంబాల సభ్యులు పెళ్లి సంబంధించిన చర్చలు కూడా జరిపారని బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద సోషల్ మీడియా ప్రచారంతో ఓ స్టార్ జోడి అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. మరి ఈ శుభవార్త చెప్పడానికి ఎంత టైమ్ తీసుకుంటారో చూద్దాం. (Photo:Instagram)