తనతో రిలేషన్షిప్లో ఉన్న మహిళను ఆమె భర్త, కుటుంబసభ్యులు తీసుకెళ్లిపోయారని.. ఇప్పుడు ఆమెను తనకు అప్పజెప్పాలని ఏకంగా ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. అదెలా కుదురుతుంది అంటే.. తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని, అగ్రిమెంట్ కూడా రాసుకున్నామని సమాధానం చెప్పాడు. ఈ వింత కేసుకు కోర్టు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.
* అసలు కథ ఏంటంటే.. : గుజరాత్ రాష్ట్రంలోని వస్కాంత జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళతో కలిసి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాడు. ఆ మహిళకు అంతకుముందే వేరే వ్యక్తితో పెళ్లి అయింది, కానీ భర్తతో విభేదాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంది. అయితే సహజీవనానికి సంబంధించి వీరిద్దరూ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇలా ఉండగా కొన్నిరోజుల తర్వాత మహిళ కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీసుకెళ్లిపోయారు. దీంతో ఆమె ప్రియుడు గుజరాత్ హైకోర్టులో హెబియస్‌కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
* బుద్ధి చెప్పేలా కోర్టు తీర్పు : గుజరాత్ హైకోర్టులో దాఖలైన ఈ కేసును జస్టిస్ వి ఎం పంచోలీ, జస్టిస్ ప్రచాక్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఎలాంటి హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది. భర్త దగ్గర భార్య ఉండటం అక్రమ కస్టడీ కిందకు రాదని సమాధానం చెప్పింది. భార్యాభర్తల మధ్య విభేదాలు పక్కన పెడితే వారిద్దరూ విడాకులు తీసుకోలేదని పేర్కొంది.