Video: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు...8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ధూలేలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానికులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.