Ice Tea: ఐస్ టీ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు... ఇలా చెయ్యండి
Ice Tea: ఐస్ టీ తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు... ఇలా చెయ్యండి
Health Benefits of Iced Tea: టీ అనగానే వేడి వేడి టీ తాగడమే మనలో చాలా మందికి తెలుసు. ఐతే... ఐస్ టీ తాగితే మానసిక ఉల్లాసమే కాదు... ఎన్నో పోషకాల్ని పొందేందుకు వీలవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
1/ 9
టీని ఆసియా దేశాలతోపాటూ... బ్రిటన్, రష్యాలో కూడా ఎక్కువగా తాగుతారు. ప్రపంచవ్యాప్తంగా టీ తాగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అది బ్లాక్ టీ అయినా, గ్రీన్ టీ అయినా, ఏదైనా సరే... తేయాకు మొక్కల నుంచే వస్తుంది. అది ఆరోగ్యానికి మేలే చేస్తుంది.
2/ 9
ఐస్ టీ తాగితే... డీ హైడ్రేషన్ సమస్య నుంచీ బయటపడవచ్చు. ఐస్ టీని రెగ్యులర్గా తాగుతూ ఉంటే... మన బాడీలో లిక్విడ్స్ లెవెల్స్ పెరుగుతాయి. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
3/ 9
విష వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి ఐస్ టీకి ఉంది. టీలోని యాంటీఆక్సిడెంట్స్... చర్మాన్ని కాపాడి... ఫ్రీ రాడికల్స్ అంతు చూస్తాయి. పండ్లు, కూరగాయల్లో కంటే... 8 రెట్లు ఎక్కువగా టీలో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
4/ 9
350 గ్రాముల కోలా డ్రింకులో 39 గ్రాముల పంచదార ఉంటుంది. అది 9న్నర టీస్పూన్లకు సమానం. దాని వల్ల 140 కేలరీల శక్తి వస్తుంది. అదే 350 గ్రాముల స్వీట్ లేని ఐస్ టీలో షుగర్ ఉండదు. 2 కేలరీల శక్తే వస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ తాగవచ్చు.
5/ 9
దంతాలు పాడవకుండా చెయ్యడంలో ఐస్ టీ ఉపయోగపడుతుంది. దంతాల్ని పాడుచేసే కేవిటీస్పై పోరాడుతుంది ఈ టీ.
6/ 9
టీలో ఉండే పోషకాలు కాన్సర్తో పోరాడతాయని 3వేలకు పైగా పరిశోధనల్లో తేలింది.
7/ 9
శరీరానికి ఎక్కువగా మాంగనీస్ కావాలనుకునేవారు... ఐస్ టీ తాగాలి. 300 గ్రాముల బ్లాక్ ఐస్ టీ... 520 మైక్రో గ్రాముల మాంగనీస్ ఇస్తుంది. అది రోజువారీ మహిళలకు కావాల్సిన మాంగనీసులో 35 శాతం కవర్ చేస్తుంది. మగవాళ్లకైతే... 23 శాతం కవర్ చేస్తుంది. మాంగనీస్ వల్ల దెబ్బలు త్వరగా తగ్గుతాయి. ఎముకలు గట్టిపడతాయి.
8/ 9
టీ తాగేవారికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని బ్రిటన్లో జరిపిన పరిశోధనలో తేలింది. రోజూ 4 కప్పుల బ్లాక్ టీ చొప్పున... ఆరు వారాల పాటూ తాగితే... బ్లడ్లో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది.
9/ 9
ఐస్ టీ గుండెకు మంచిదని పరిశోధనల్లో తేలింది. రోజూ మూడు కప్పుల ఐస్ గ్రీన్ టీ తాగేవాళ్లలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 35 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది.