తమిళనాడులో మళ్లీ అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే బీజేపీతో కలిసి ముందుకుసాగగా... పదేళ్ల తర్వాత కచ్చితంగా అధికారం చేపట్టాలని డీఎంకే కాంగ్రెస్తో కలిసి కసిగా పోరాడింది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 6 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈసారి అక్కడ 3,998 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరి ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో.
ఇక కేరళలో 1980 నుంచి ఓటర్లు ప్రతి ఐదేళ్లకోసారి పార్టీని మార్చేస్తున్నారు. LDF, UDF మార్చి మార్చి అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఐతే... ఈసారి ఈ చరిత్ర పునరావృతం కాదు అంటున్నారు. ఇక్కడ మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2.74 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. 957 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.