Assam Assembly Election 2021: మిగతా రష్ట్రాల్లో కంటే అసోంలో ఎన్నికల సందడి బాగా కనిపిస్తోంది.
2/ 15
ఉదయం నుంచే అక్కడ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎండాకాలం అయినా లెక్క చెయ్యట్లేదు.
3/ 15
ఇది అసోం... గౌహతీలోని అమింగావ్ రైల్వే బెంగాలీ స్కూల్ పోలింగ్ కేంద్రం. ఓటర్లు ఎలా తరలివచ్చారో చూడండి.
4/ 15
ఉదయం మొదట వచ్చిన ఓటర్లంతా కరోనా జాగ్రత్తలు పాటించారు. ఆ తర్వాత ఓటర్ల సంఖ్య పెరిగిపోవడంతో కరోనా రూల్స్ అటకెక్కాయి.
5/ 15
ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర... మాస్కులు, శానిటైజర్లు ఇతరత్రా అందుబాటులో ఉంచుతున్నారు. అయినా చాలా మంది మాస్క్ లేకుండా ఉంటున్నారు.
6/ 15
అసోంలో 40 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఇదే చివరి మూడో విడత. 337 మంది అభ్యర్థులు ఇవాళ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
7/ 15
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు కరోనా వైరస్ తలనొప్పిగా మారింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయినా సరే కరోనా వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
8/ 15
అసోంలో యువత పెద్ద సంఖ్యలో తరలిరావడంతో... సోషల్ డిస్టాన్స్ అన్నది అమల్లో కనిపించట్లేదు.
9/ 15
ఇలాగైతే కరోనా సోకకుండా ఎలా ఉంటుంది అనేది ఆరోగ్య నిపుణులు వేస్తున్న ప్రశ్న.
10/ 15
కరోనా ఉంది కదా అని పనులను, ఎన్నికలను వాయిదా వేసుకోలేం అన్నది ఎన్నికల సంఘం ఇస్తున్న సమాధానం.