3 KILLED AS SEVEN VEHICLES COLLIDE WITH EACH OTHER IN KERALA SK
Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 7 వాహనాలు ఢీ.. ముగ్గురు దుర్మరణం
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 06.45 నిమిషాల సమయంలో కుథిరన్ ప్రాంతంలో ఏడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. త్రిస్సూర్ - పాలక్కడ్ హైవేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.

2/ 8
ఘాట్ రోడ్డులో మొదట ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారు పలు వాహనాలను ఢీకొట్టింది. లారీ ఓవర్ టేక్ సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
3/ 8
ఈ ప్రమాదంలో బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, కారులో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి మరణించారు. పలువురికి గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో కుథిరన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
4/ 8
ప్రమాదంలో ఏడు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జేసీబీల సాయంతో రోడ్డుపై పడిపోయిన వాహనాలను పక్కకు తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.