Delta Plus Variant: సెకండ్ వేవ్‌ కేసులు తగ్గుతున్నాయని హ్యాపీగా ఉన్నామో.. లేదో.. ఇంతలోనే మరో బ్యాడ్‌న్యూస్

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కాస్తంత ఊరట చెందుతున్న ప్రజలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. డెల్టా వేరియంట్‌లో సంభవించిన మ్యుటేషన్ కారణంగా పుట్టుకొచ్చిన ‘డెల్టా ప్లస్’ వేరియంట్ కేసులు భారత్‌ను తాజాగా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దేశంలో కొత్తగా 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకటించారు.