సిలిగురికి చెందిన ఈ బాలుడు కళ్లు మూసుకుని పుస్తకం మొత్తం చదువుతాడు. అతని నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దక్ష్ 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాటలు సరిగా వచ్చేవి కాదు. పెద్దగా చదివే వాడు కాదు. పరీక్షల్లో మంచి మార్కులే వచ్చినప్పటికి క్లాస్‌లో వాటిని అప్పజెప్పడంలో మాత్రం ఎప్పుడూ వెనకబడిపోయేవాడు.
దక్ష్లో ఉన్న మాట తడబడటం, జ్ఞాపకశక్తి లేకపోవడం, భాషలో స్పష్టత రాకపోవడం వంటిని గమనించారు అతని తల్లి అర్చన సింగ్. న్యూరో-లింగ్విస్టిక్ ప్రాక్టీషనర్‌గా పని చేస్తున్నా ఆమె తన కొడుకులో ఉన్న సమస్యను బాగా మాట్లాడేందుకు సంస్కృతం నేర్పింది. ధ్యానంతో పాటు ట్రీట్మెంట్ ఇప్పించడంతో అతనిలోని మేధాశక్తి అద్భుతమైన నైపుణ్యవంతుడిగా మార్చింది.
దక్ష్ తనకున్న మెమరీ పవర్, తెలివి తేటలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. చూడకుండా ఒక్క నిమిషంలో పుస్తకంలోని పేర్లు, విభాగాలు, అంకెలు, లెక్కలను సైతం చూడకుండా టక్కున చెప్పేలా తర్పీధు పొందాడు. అంతే కాదు తనపై నమ్మకం పెంచుకున్నందుకు కళ్లు మూసుకుని నిముషంలో ఎన్నో సంఖ్యలను గుర్తు పెట్టుకోగలడు.
మ్యూజిక్ హీలింగ్ థెరపిస్ట్ కూడా దీక్ష్లోని హెవీ టాలెంట్‌ని గమనించారు. మ్యూజిక్ హీలింగ్ టెక్నాలజీ ఎడమ మరియు కుడి మెదడు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మ్యూజిక్ థెరపీ మెదడులోని పీనియల్ గ్రంథి నుండి రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్ ఫలితంగా, శరీరం మరమ్మత్తు చేయబడుతుంది, ఇది వివిధ శరీర భాగాలను మెదడుతో కమ్యూనికేట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. వీటి కారణంగానే దీక్ష కళ్ళు మూసుకుని పుస్తకాలు చదవగలుగుతున్నాడని అతని తల్లి తెలిపింది.